ETV Bharat / state

అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి - 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం - BASAVATARAKAM CANCER HOSPITAL

ఏపీలో బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి - జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం

15 Acres for Basavatarakam Cancer Hospital at Amaravati
15 Acres for Basavatarakam Cancer Hospital at Amaravati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 7:45 AM IST

15 Acres for Basavatarakam Cancer Hospital at Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించింది. నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఇటీవల ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna), సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పరిశీలించారు. ఆ ప్రాంతంలో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించాలని సీఆర్డీఏ అధికారులు ట్రాన్స్‌కోకు లేఖ రాశారు. లైన్లు తొలగించే పనులను ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చినట్లు సమాచారం.

ఫేజ్‌-1లో 300 పడకలతో బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్​ని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి యాజమాన్యం పలు డిజైన్లను తయారు చేసింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రెండు సార్లు సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి కమిషనర్‌తో సంప్రదింపులు జరిపారు. విద్యుత్‌ లైన్ల తొలగింపు పూర్తి అయితే జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

'అవసరమైన వారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్స'

లాభాపేక్ష లేకుండా రోగులకు చికిత్స అందించడమే లక్ష్యం : బసవతారకం ఆస్పత్రి సీఈవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.