పోర్టుల ద్వారా 2 కోట్ల టన్నుల బియ్యం అక్రమంగా తరలించారు: డొక్కా మాణిక్యవరప్రసాద్ - EX MINISTER DOKK ON RATION RICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2024, 4:49 PM IST
Ex Minister Dokk on Ration Rice Scam: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 15 వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరారు. గత ఐదేళ్లలో కాకినాడ సహా వివిధ పోర్టుల ద్వారా 2 కోట్ల టన్నుల బియ్యం అక్రమంగా తరలించారని, దీని వెనుక గత సీఎంవో నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉందని అన్నారు.
బియ్యం దొంగలను పట్టుకుని శిక్షించాలని కోరారు. బియ్యం దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. అదే విధంగా పీడీఎస్ బియ్యం సరఫరా కోసం కొన్న వాహనాల్లో రూ. 600 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ, 104, 108, పశువైద్య వాహనాల కొనుగోలులోనూ భారీగా అక్రమాలు జరిగాయన్న డొక్కా, ఇందులో మాజీ సీఎంకు సోదరుడి వరసయ్యే వ్యక్తి, ఓ అధికారిణి ముఖ్య భూమిక పోషించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.