ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సెర్ప్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ స్వచ్చంద ఉద్యోగ విరమణ- ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయడానికేనా? - Govt Accept Imtiaz Retirement

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 8:49 PM IST

SERP CEO MD Imtiaz Voluntary Retirement Government Accept : సీసీఎల్​ఏ అదనపు కమిషనర్, సెర్ఫ్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ స్వచ్చంద ఉద్యోగ విరమణ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. ఆయన చేసిన దరఖాస్తును తక్షణమే ఆమోదిస్తున్నట్లు పేర్కోంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 3 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఈ మేరకు నాన్ కేడర్ ఐఏఎస్​గా ఉన్న ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తును అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసిన ఇంతియాజ్ త్వరలోనే వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హడావిడిగా ఐఎఎస్ సర్వీసుకు ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వం ఆమోదించేసినట్టు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details