సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ - రూ.25 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
Published : Mar 14, 2024, 1:15 PM IST
SBI ATM Robbery In Nizamabad Video : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ బస్టాండ్ సమీపంలో ఎస్‌బీఐ ఏటీఎం (SBI ATM Theft in Nizamabad)లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. బుధవారం అర్ధరాత్రి బొలెరో వాహనంలో నలుగురు దుండగులు మాస్కులు ధరించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ తమ ఫుటేజ్ రికార్డు కాకుండా ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలపై స్ప్రే చేశారుని వెల్లడించారు.
SBI ATM Theft In Nizamabad : అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు వివరించారు. ఏటీఎం విడిభాగాలను బయట పడేసినట్లు చెప్పారు. బస్టాండ్ సమీపంలోని ప్రధాన ఏటీఎం కావడంతో భారీగా నగదు చోరీకి గురైనట్టు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్ సీఐ జయేశ్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్ వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతలు చేపట్టి ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని కోరారు.