ఏం తెలివిరా బాబూ! - చెరువులో నుంచి ఇసుకను ఎలా తోడేస్తున్నారో చూడండి - ట్రాక్టర్ తాళ్ల సాయంతో ఇసుక
Published : Feb 15, 2024, 9:58 AM IST
Sand Mafia In Nirmal : చేసే పని అక్రమం. నిబంధనలకు విరుద్ధం. బహిరంగంగా సాగుతున్న ఈ దందా అధికారులకు తెలియంది కాదు. అయినా నిర్భీతిగా సాగిపోతుంది. అక్రమమా, సక్రమమా అనే విషయం కాసేపు పక్కనపెడితే, ఈ తతంగానికి పాల్పడుతున్న వారి ఆలోచనను చూస్తే ఒకింత విస్మయానికి గురవడం ఖాయం. సాధారణంగా వాగులు, చెరువుల నుంచి ఇసుకను తీయడానికి ప్రొక్లెయినర్లు వాడుతారు. లేదా కూలీలతో తీయిస్తారు. కానీ నిర్మల్ జిల్లా సారంగాపూర్, దిలావార్పూర్ తదితర మండలాల పరిధిలోని స్వర్ణ వాగు ప్రాంతంలో భిన్న దృశ్యం కనిపిస్తోంది.
Extraction Sand with Tractor Rope : ట్రాక్టర్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాళ్లు, గిరక లాంటి వస్తువుల సాయంతో చెరువు నుంచి ఇసుకను తోడేస్తున్నారు. తాళ్లకు అమర్చిన పెద్ద పరిమాణంలో ఉండే పార నీటిలోకి వెళ్లి, అక్కడి నుంచి ఇసుకను లాక్కొని బయటకు వస్తుంది. అలా పోగు చేసిన ఇసుకను అక్కడే జాలీ పట్టి, ట్రాక్టర్లో నింపుతూ విక్రయిస్తున్నారు. మనుషులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, సులభంగా ఇసుకను తోడుకొచ్చే ఈ ఏర్పాట్లు చూసేవారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ దృశ్యాలు మీరూ చూసేయండి.