తెలంగాణ

telangana

ETV Bharat / videos

కుళ్లిన మాంసం, బూజుపట్టిన కూరగాయలు - ఆ రెస్టారెంట్​లో తింటే అంతే! - Food Inspections in peddapalli - FOOD INSPECTIONS IN PEDDAPALLI

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 7:18 PM IST

Running a Hotel in Peddapalli Without Following the Standards : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పద్మావతి కాలనీలో సరైన ప్రమాణాలు పాటించని శాఫ్రాన్​-9 రెస్టారెంట్​​లో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కుళ్లిన మాంసం, పాచిపోయిన అన్నం, బూజు పట్టిన కూరగాయలతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే వంటగదిలో కనీసం పరిశుభ్రత పాటించలేదని తెలిపారు. కాగా అవే కూరగాయలతో వంటకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని ఎలా ప్రజలకు పెడుతున్నారని హోటల్ యజమానిని ప్రశ్నించారు. 

మరోవైపు వాడిన నూనే మళ్లీ ఉపయోగిస్తున్నారని దాని వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని వివరించారు. నాణ్యత ప్రమాణాలు పాటించలేదని హోటల్​కు రూ.30వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ఇలాంటి సమస్యే పునరావృత్తం అయితే హోటల్​ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గమనించాలని సూచించారు. ఆహార పదార్థాలు సరిగ్గా లేకపోతే తమకు సమాచారం ఇవ్వాలని ఫుడ్​ సేఫ్టీ అధికారులు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details