తెలంగాణ

telangana

ETV Bharat / videos

మేడారం జాతరలో దొంగల చేతివాటం - సీసీ కెమెరాలు ఉన్న ఫలితం శూన్యం - Medaram news

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 4:22 PM IST

Robbery At Medaram Fair : భక్తులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న జేబు దొంగలు మేడారం జాతరలో తమ చేతివాటం చూపిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలో జనాలు రద్దీ ఆసరాగా తీసుకుని అలవోకగా వారి నుంచి నగదు, బంగారు అభరణాలు, మొబైల్స్ చాకచక్యంగా కొట్టేస్తున్నారు. చోరీలో దొంగలు విభిన్న పంథాలను ఎంచుకుంటున్నారు. 

Theft In Medaram : గద్దెలు, జన సమూహాలను ఎంచుకుని దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం ఆదమరిచినా బంగారు ఆభరణాలు, డబ్బులు, సెల్​ఫోన్లను దొంగిలిస్తున్నారు. హెల్ప్‌డెస్క్‌లు, తప్పిపోయిన శిబిరాల వద్దకు బాధితులు పరుగులు తీసినా ఫలితం లేకుండా పోతోంది. కనీసం సీసీ కెమెరాల్లో చూసి వెతికేందుకు కూడా ప్రయత్నం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. అసలు తమ గోడు ఎవరూ వినడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వీఐపీల కోసమే పనిచేస్తున్నారని వాపోతున్నారు.  మేడారం జాతరలో జేబుదొంగల హల్‌చల్‌, బాధితుల ఆవేదనను మా ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details