6 అడుగుల తాచుపాము హల్ చల్ - చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ సేవియర్ సొసైటీ సిబ్బంది - SNAKE HaLCHaL AT house - SNAKE HALCHAL AT HOUSE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 10:04 AM IST
Rattle Snake Halchal in House At Eluru District : ఏలూరు జిల్లాలో ఓ నివాసంలో 6 అడుగుల తాచుపాము హల్ చల్ చేసింది. జీలుగుమిల్లి గ్రామానికి చెందిన మేకల వెంకటేశ్వరరావు నివాసంలో సుమారు మూడు గంటల పాటు ఇంటి పెరటిలో తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడేనికి చెందిన స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించారు. ఇంట్లో చొరబడిన పామును స్నేక్ సేవియర్ సిబ్బంది చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆ పాముకు 15 సంవత్సరాల వయసు కలిగి, అత్యంత విషపూరితమైన జాతికి చెందినదని క్రాంతి తెలిపారు. దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని పేర్కొన్నారు.
పాము పేరు వింటేనే చాలామంది వణికిపోతారు. అలాంటిది 6 అడుగుల పాము ఎదురుపడితే భయంతో హడలెత్తిపోతారు. పాము ఎక్కడ కాటేస్తుందో అనే భయంతో కొట్టి చంపేస్తుంటారు. పొలానికి వెళ్లినపుడు ఇలాంటి ఎన్నో సంఘటనలు. ప్రకృతిలో భాగమైన వాటికీ జీవించే హక్కు ఉంటుంది కదా అని చలించిన సంస్థ స్నేక్ సేవియర్ సొసైటీ. ఎంతటి విషసర్పాన్ని అయినా ఇట్టే పట్టేస్తూ పాముల సంరక్షణే ధ్యేయంగా ఆ సంస్థ పనిచేస్తుందని క్రాంతి తెలియజేశారు.