తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎలుకా ఎలుకా ఉచ్ ఎక్కడికెళ్లావోచ్ - చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్నానోచ్ - RAT IN CHUTNEY AT JNTU COLLEGE - RAT IN CHUTNEY AT JNTU COLLEGE

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 12:49 PM IST

Rat In Chutney At JNTU Campus  Sangareddy : ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. బాలుర హాస్టల్​ క్యాంటీన్‌లోని చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో గిన్నెలో ఎలుక పడిపోయింది. 

నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులకు దీనిని పంపించారు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై ప్రిన్సిపల్‌ నరసింహ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని ఆయన స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో మాత్రమే ఎలుక కనిపించిందని పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆయన ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details