ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - RAJYA SABHA LIVE - RAJYA SABHA LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 12:16 PM IST

Updated : Jun 28, 2024, 1:00 PM IST

Rajya Sabha Session LIVE : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జేపీ నడ్డా రాజ్యసభా పక్ష నేతగా నియమితులయ్యారు. పీయూశ్ గోయల్ స్థానంలో నడ్డా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాని మోదీ రెండోసారి గెలిచినప్పుడు రాజ్యసభా పక్షనేతగా గోయల్ వ్యవహరించగా, ఇప్పుడు ఆయన స్థానంలో నడ్డా బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరోవైపు, రాజ్యసభా పక్షనేతగా నియమితులైనందుకు నడ్డాకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అభినందనలు తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి నడ్డా రాజీనామా చేస్తారని ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈ ఏడాది చివర్లలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కమలం నేతలు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా నడ్డా ఎన్నికయ్యారు. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. నీట్​ పేపర్​ లీక్​పై సభలో గందరగోళం కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jun 28, 2024, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details