WOMAN CONSTABLE DIED: తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. అనంతరం గురువారం ఉదయం ఎస్సై సాయికుమార్ మృతదేహం సైతం లభ్యమయింది.
వివరాల్లోకి వెళ్లితే భిక్కనూరు ఎస్సై సాయికుమార్ సెల్‌ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచాఫ్ వస్తోంది. దీంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీశారు. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు పోలీస్ స్టేషన్లో చెప్పి బయటికి వచ్చారు.
మధ్యాహ్నం అయినా కుమార్తె రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలపడంతో ఆందోళన చెందిన శ్రుతి కుటుంబ సభ్యులు వెంటనే అధికారులను సంప్రదించారు. శ్రుతి ఫోన్ సిగ్నల్ కూడా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన పెద్దచెరువు వద్దకు చేరుకున్నారు.
పెద్దచెరువు వద్ద ముగ్గురి ఫోన్లు, ఎస్‌ఐ కారు, చెప్పులు గుర్తించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శ్రుతి ఫోన్‌తో బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్‌ఫోన్ సైతం దొరికింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులూ కనిపించాయి. వెంటనే అనుమానంతో చెరువులో పోలీసులు గాలించడంతో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు.
అంతుచిక్కని మిస్టరీ: ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కూడా చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అనేది మాత్రం బయటకు రాలేదు. పోలీసులు ఏమైనా వివరాలు వెల్లడిస్తేగానీ ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
"ఇంట్లో ఇల్లాలు - లాడ్జిలో ప్రియురాలు" రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎంపీడీఓ
వివాహేతర సంబంధం - తీసింది ఇద్దరి ప్రాణం - extra marital relationship suicide