LIVE : రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - Heavy Rains in Telangana - HEAVY RAINS IN TELANGANA
Published : Apr 20, 2024, 10:41 AM IST
|Updated : Apr 20, 2024, 11:15 AM IST
Unseasonal Rains in Telangana : తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంట నష్టపోయి రైతులు అల్లాడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలు నీట మునిగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరోవైపు అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట పొలంలోనే నీళ్లపాలవుతోందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పంట కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే వర్షానికి ధాన్యమంతా తడిసి ముద్దయిపోయిందని వాపోతున్నారు. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమని ఆదుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని కోరారు.
Last Updated : Apr 20, 2024, 11:15 AM IST