సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మొబైల్ దొంగల అరెస్ట్ - రూ.10 లక్షల విలువైన సెల్ఫోన్లు స్వాధీనం - సికింద్రాబాద్ రైలు దొంగలు
Published : Feb 17, 2024, 2:17 PM IST
Railway Sp On Cell Phone Snatchers : సికింద్రాబాద్ రైళ్లలో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరు మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి నిందితుల నుంచి రూ.10 లక్షల విలువైన 66 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ షేక్ సలీమ తెలిపారు.
Secunderabad Railway Police Arrested Robbery Gang : రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌లపై, రైలు ఎక్కేటప్పుడు ఒంటరిగా ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జి.ఆర్.పి, ఆర్.పి.ఎఫ్ పోలీసుల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురుని విచారించగా, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మాణిక్, దిలీప్ పాటిల్‌లతో కలిసి హైదరాబాద్ నగరానికి చెందిన చైతన్య, రిజ్వాన్, శంకర్, మాణిక్యంలు మొబైల్ ఫోన్లను చోరీ చేస్తూ మహారాష్ట్ర, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తే, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సులువుగా గుర్తించవచ్చని సూచించారు.