ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అప్పుడు ఎన్టీఆర్​, ఇప్పుడు చంద్రబాబు'- పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల హర్షాతిరేకాలు - Pension Hike in Andhra Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 7:42 PM IST

Public Reaction on Pension Hike (ETV Bharat)

Public Reaction on Pension Hike: సామాజిక పింఛన్ల పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి నాలుగేళ్ల సమయం తీసుకుందని విమర్శిస్తున్నారు. సంవత్సరానికి 250 రూపాయల పింఛన్ పెంచుతూ, తమని బిచ్చగాళ్లుగా చూసిందని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా తెదేపా కూటమి ప్రభుత్వం మొదటి ప్రధాన్యతగా సామాజిక పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగానే డబ్బులు ఇవ్వడం సంతోషంగా ఉందని పింఛన్ దారులు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో 75 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ నేడు రూ.4000కు చేరడం ఆనందంగా ఉందని వృద్ధులు పేర్కొన్నారు. జూలై నెల నుంచి రాష్ట్రంలో ఉండే సామాజిక పింఛన్ల లబ్ధిదారులందరికీ నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details