'రాజమండ్రి జైళ్లో రహస్యం' - ఉన్నతాధికారి చిత్రహింసతో జీవితఖైదీ ఆస్పత్రి పాలు! - PRISONER TORTURED IN CENTRAL JAI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2024, 2:45 PM IST
Prisoner Tortured in Rajamahendravaram Central Jail : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైళ్లో జీవిత ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలు పెట్టారనే వార్త సంచలనం రేపుతోంది. సోమవారం రాత్రి జైళ్ల శాఖ ఉన్నతాధికారి దాడి చేయడంతో ఖైదీకి రక్తస్రావం అయినట్లు సమాచారం. జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడితో ఉన్నతాధికారి వ్యక్తిగత పనులు చేయించుకున్నట్లు తెలిసింది. ఘటనపై జైలు అధికారులు ఎవరూ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ అధికారి ఇంతకు ముందు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడ్డట్టు సమాచారం. ఖైదీకి చికిత్స గోప్యంగా జరిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆ ఖైదీ పరిస్థితి ఎలా ఉంది? రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఖైదీలకు ప్రత్యేక వార్డు ఉన్నప్పటికీ ఎందుకు అక్కడకు తీసుకు వెళ్లలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దీని పట్ల అధికారులు ఎలా వ్యవహరిస్తానేది ఆసక్తి రేకెత్తిస్తోందిీ. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందజేస్తారు.