తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : టీమ్ ఇండియా క్రికెటర్లతో ప్రధాని మోదీ భేటీ - ప్రత్యక్ష ప్రసారం - Modi Interaction with Team India - MODI INTERACTION WITH TEAM INDIA

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 1:42 PM IST

Updated : Jul 4, 2024, 2:47 PM IST

PM Modi Interaction With Team India Today Live : టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 3రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్‌ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్‌ సేన గురువారం ఉదయం దిల్లీ ఎయిర్​ పోర్ట్​కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా పీఎం నివాసానికి చేరుకున్న ప్లేయర్లు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు.ప్రధానితో భేటీ అయ్యాక టీమ్ఇండియా స్పెషల్ ఫ్లైట్​లో ముంబయి వెళ్లనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబయిలో భారీ రోడ్ షో ఉండనుంది. ఈ క్రమంలో రోడ్​ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Last Updated : Jul 4, 2024, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details