తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : శ్రీనగర్‌లో పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం - పాల్గొన్న ప్రధాని మోదీ - PM MODI PARTICIPATE YOGA DAY - PM MODI PARTICIPATE YOGA DAY

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 8:28 AM IST

YOGA Live FROM Srinagar : దేశవ్యాప్తంగా పదో అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబురాలు జరుగుతున్నాయి. శ్రీనగర్​లోని డాల్​ సరస్సు ఒడ్డున యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. షేర్​-ఏ-కశ్మీర్​ సమావేశ కేంద్రం వద్ద ప్రధాని మోదీ యోగాసనాలు చేస్తున్నారు. అనేక మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్​లోని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. నిజాం కాలేజీ గ్రౌండ్స్​లో యోగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ రాధాకృష్ణన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా వ్యక్తులు, సమాజ ఆరోగ్యానికి దోహద పడుతుందని చెబుతున్నారు. మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని గవర్నర్ ఈ సందర్భంగా చెబుతున్నారు. మనస్సు, శరీరాల మధ్య సమతుల్యతను సాధించడంలో యోగా సహాయపడుతుందని గవర్నర్ అన్నారు. ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలోనే యోగా కూడా పుట్టింది. యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. మన ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పురుడుపోసుకున్న యోగా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. యోగాతో సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడని నిపుణలు చెబుతున్నారు. అక్కడ ఉన్నవారు యోగా చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details