గిద్దలూరులో 'స్థానికత' చిచ్చు - వైసీపీ వర్గాల మధ్య వార్ - ఎమ్మెల్యే అన్నా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 3:28 PM IST
Prakasam District YSRCP Class War: ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు స్థానికుడు కాదని విమర్శించడంపై, కొందరు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ సారి కూడా అన్నా వెంకట రాంబాబుకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు మద్దతు తెలుపుతూ కొమరోలులో స్థానిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే స్థానికుడు కాదని వస్తున్న విమర్శలపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2009 నుంచి గిద్దలూరులో నివాసం ఉంటుండగా ఎలా స్థానికుడు కాకుండా పోతాడని ప్రశ్నించారు.ఎమ్మెల్యే పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, ఎమ్మెల్యేకి మద్దతు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి నాయకుడికి ఎమ్మెల్యే సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రోత్సహించారని అలాంటి వ్యక్తిపై, విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ అన్నాను ఎమ్మెల్యే పోటీలో నిలబెడితే అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేేశారు.