సీనియర్ ఐఏఎస్‌లు జవహర్‌రెడ్డి, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్ - Postings for Senior IAS Officers - POSTINGS FOR SENIOR IAS OFFICERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 9:23 AM IST
Postings for Senior IAS Officers: వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు కేఎస్ జవహర్ రెడ్డికి (KS Jawahar Reddy), పూనమ్ మాలకొండయ్యకు (Poonam Malakondaiah) పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఆ విభాగం అదనపు బాధ్యతల్లో ఉన్న అనంత రామును రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో జీపీఏం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్యకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
జవహర్ రెడ్డి, పూనమ్ మాలకొండయ్యలు ఈ నెల 30 తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఉద్యోగ విరమణ చేయనున్న మూడు రోజుల ముందు ఇరువురు అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. అదే విధంగా ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ కేడర్‌లో చేరిన సీనియర్ పీయూష్ కుమార్‌ను సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగానూ పీయూష్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.