పెన్షన్ డబ్బుల చిల్లర పైసలకు బదులు పింఛన్‌దారులకు సబ్బులు - Soaps instead of full Pension - SOAPS INSTEAD OF FULL PENSION
Published : May 9, 2024, 9:19 PM IST
Distribution of soaps to pensioners instead of money : వృద్ధులకు 2016 రూపాయలు, వికలాంగులకు రూ.4016 ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులకు పోస్టు ఆఫీసు అధికారులు రూ.16 చిల్లర లేవని దానికి బదులు సబ్బులు ఇస్తున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో పెంబి మండలంలోని మందపల్లిలో జరిగింది. చుట్టుపక్కల గ్రామాల పెన్షన్‌దారులకు సరైన రవాణా లేకపోయినా కాలినడకన పెన్షన్ కోసం పోస్టు ఆఫీస్‌కు వెళ్లారు. పూర్తి మొత్తంలో పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా 16 రూపాయల చిల్లర లేదని సబ్బులు ఇస్తున్నారని పెన్షన్‌దారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Pensioners Demand for Full Pension Amount : వృద్ధులు, వికలాంగులు కావడంతో ఏమీ చేయలేక సబ్బులు తీసుకోవాల్సి వస్తుందని పలువురు పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి బదులు అందరికీ డబ్బులు ఇవ్వాలని మొరపెట్టుకున్నా పెన్షన్ చిల్లర రూపాయలకు సబ్బులు ఇస్తున్నారని వాపోయారు. సబ్బులు తమకు వద్దని రావాల్సిన పెన్షన్‌ను పూర్తిగా నగదు రూపంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.