ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాడిపత్రికి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి - హెచ్చరించిన పోలీసులు - police warning to kethireddy - POLICE WARNING TO KETHIREDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 12:00 PM IST

Police Warning to Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో ఉండకూడదు అంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హెచ్చరించారు. పోలింగ్ రోజు తాడిపత్రిలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో షరతులతో కూడిన బెయిల్​ను హైకోర్టు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇచ్చింది. తాడిపత్రికి వెళ్లరాదని, హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించి పెద్దారెడ్డి తాడపత్రికి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో ఉండకూడదంటూ, వెంటనే అనంతపురం వెళ్లిపోవాలని పెద్దారెడ్డికి సూచించారు. దీంతో పెద్దారెడ్డి వాహనంలోనే పోలీసులు అనంతపురానికి ఆయనని పంపించేశారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడంతో అనంతపురంలో పెద్దారెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

మరోవైపు ఫ్యాక్షన్ చేస్తానన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అతని కుమారులను నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. తాడిపత్రి పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలింగ్ రోజు తమ కార్యకర్త ఇంటిపై దాడి చేశారని గుర్తు చేశారు. పెద్దారెడ్డి నియోజకవర్గానికి వస్తే ఊరుకునేది లేదని, అతనిని, అతని కుమారులని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details