ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వీడిన చికెన్​ వ్యాపారి కిడ్నాప్​ మిస్టరీ - డబ్బు కోసమేనని పోలీసుల వెల్లడి - POLICE CHASED THE KIDNAP CASE - POLICE CHASED THE KIDNAP CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 1:54 PM IST

Police Chased Kidnap Case in Kothacheruvu : సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలంలో కలకలం సృష్టించిన చికెన్ వ్యాపారి కిడ్నాప్ కేసును కొత్తచెరువు పోలీసులు గంటల వ్యవధిలోని ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 24న చలపతిని తెల్లవారుజామున నాలుగు గంటలకు నిందితులు కిడ్నాప్ చేసి కారులో తీసుకొని వెళ్తుండగా ముదిగుబ్బ వద్ద పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించిన కొత్తచెరువు ఎస్సై రాజా రమేష్​ను అతని సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

జల్సాలకు అలవాటు పడిన నిందితులు డబ్బు కోసం సమీప బంధువైన చలపతిని కిడ్నాప్‌ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. రెక్కీకి ఉపయోగించిన కారు, సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. నిందితులను కోర్టులో హాజరపరుస్తామని పోలీసులు తెలిపారు. చికెన్​ సెంటర్​ వ్యాపారి చలపతిని ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద నుంచి షాపుకు వెళ్తుండగా రెండు కార్లలో వచ్చి బలవంతంగా కిడ్నాప్​ చేశారని అతడి భార్య తెలిపింది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తక్షణమే పోలీసులు జిల్లాలోని అన్ని పీఎస్‌లను అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు ముదిగుబ్బ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details