Lokesh on Visakha Data City : విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది ప్రపంచానికే తలమానికంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీప్ టెక్ సమ్మిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
AP Digital Technology Summit 2025 : ఏపీ పునర్నిర్మాణంలో ఐటీదే కీలకపాత్రని లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి డీప్ టెక్ సదస్సులు అందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇస్తున్నారని వెల్లడించారు. ఒక్క కియా పరిశ్రమ రాయలసీమ ముఖచిత్రాన్నే మార్చిందని గుర్తు చేశారు. డ్రోన్ల టెక్నాలజీని సహాయ కార్యక్రమాల్లోనూ వినియోగిస్తున్నామని వివరించారు. రతన్ టాటా మంచి దార్శనికుడని, దేశ పురోగతి కోసం తపించేవారని లోకేశ్ వెల్లడించారు.
అధునాతన సాంకేతికత లక్ష్యం - ఐఐటీ మద్రాసుతో 8 ఒప్పందాలు
మా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించింది : లోకేశ్