ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనంతపురం జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్ - వారిని టార్గెట్ చేసే విక్రయాలు! - police arrested ganja selling gang - POLICE ARRESTED GANJA SELLING GANG

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 9:44 PM IST

Police Arrested Ganja Selling Gang Anantapur District : అనంతపురం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పామిడి పట్టణ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ, "గుంతకల్లు నియోజకవర్గం పామిడి పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ప్రత్యేక టీం లతో ఆ ప్రాంతానికి వెళ్లి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 

అలాగే ఒక కారు, రెండు ద్విచక్ర వావానాలు, 5 సెల్ ఫోన్లు, రూ.5000 రుపాయల నగదులు రికవరీ చేసుకున్నాం. ముఠా సభ్యులు వైజాగ్ రూరల్ ఏరియా నుంచి కారు, బస్సుల్లో హోల్ సెల్​గా గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా యువతను, గంజాయికి బానిసలైన వారిని టార్గెట్ చేసి విక్రయాలు జరుపుతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తాం" మని సీఐ రాజశేఖర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details