ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ - ప్రత్యక్ష ప్రసారం - modi mangalagiri aiims opening

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 2:37 PM IST

Updated : Feb 25, 2024, 5:55 PM IST

PM Narendra Modi Live : విభజన చట్టం ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్ ఏర్పాటైంది. అధునాతన ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం కోసం కేంద్రం 16వందల 18 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలంతో పాటు కొన్ని మౌలిక వసతులు కల్పించింది. 2015 డిసెంబర్ 19న ఈ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. 2019 మార్చి 12న ఓపీ సేవలు మొదలయ్యాయి. తొలిరోజు 44మంది రోగులతో ప్రారంభం కాగా. ఇప్పుడు రోజుకు 2,500మంది వస్తున్నారు. ఐదేళ్లలో15లక్షల మందికి పైగా వైద్య సేవలు పొందారు. 2020 జూన్ 11న ఇన్ పేషంట్ సేవలు మొదలవగా ఇప్పటి వరకు 21వేల మందికి పైగా చికిత్స తీసుకున్నారు. ఎయిమ్స్ లో ఓపీ ఫీజు కేవలం 10రూపాయలే. గుజరాత్‌ నుంచి మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌తో పాటు రాజ్‌కోట్, బటిండాలను మోదీ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 900 బెడ్ల సామర్థ్యంతో ఎయిమ్స్‌ ఆస్పత్రిని నిర్మించారు. మెుత్తం 41 విభాగాలను ఎయిమ్స్‌లో సేవలు అందించేలా ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 25, 2024, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details