LIVE : కార్గిల్ 25వ విజయ్ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ - ప్రత్యక్ష ప్రసారం - KARGIL VIJAY DIWAS 2024
Published : Jul 26, 2024, 9:54 AM IST
|Updated : Jul 26, 2024, 10:44 AM IST
Kargil Vijay Diwas 2024 Live : కార్గిల్ 25వ విజయ్ దివస్ నేడు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్గిల్‌లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. ఉదయం 9.20 గంటలకు ఆయన యుద్ధ స్మారకం వద్దకు చేరుకుంటారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తారు. మరోవైపు కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలు గురువారం ద్రాస్‌లో ప్రారంభమయ్యాయి. పాక్‌పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది. ‘రజత్ జయంతి వర్ష్’ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గురువారం నాటి కార్యక్రమంలో సీనియర్ అధికారులు, గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు, యుద్ధంలో ప్రాణాలర్పించిన వారి బంధువులు పాల్గొన్నారు. లామోకెన్ వ్యూ పాయింట్‌లో విజయ్ భోజ్, శౌర్య సంధ్య పేరుతో కార్యక్రమాలు జరిగాయి.కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా లద్దాఖ్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద భారత త్రివిధ దళాలలు నివాళులు ఆర్పించాయి. సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు ఆర్పించారు. భారత ఆర్మీ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది యుద్ధస్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. నావికాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కుమార్ కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు ఆర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకున్న భారత వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి యుద్ధ స్మారకం వద్ద పుష్ప గుచ్చం ఉంచి, నివాళులు ఆర్పించారు. అంతకుముందు కార్గిల్ యుద్ధంలో అమరలు అయిన సైనికుల కుటుంబాలు నివాళులు ఆర్పించాయి. ప్రస్తుతం కార్గిల్ 25వ విజయ్ దివస్ నేడు జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 26, 2024, 10:44 AM IST