అధిక వడ్డీ చెల్లించాలని వ్యాపారి వేధింపులు - తాళలేక వ్యక్తి ఆత్మహత్య - Person Suicide in Money Harassment - PERSON SUICIDE IN MONEY HARASSMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 6:50 PM IST
Person Committed Suicide Due to Money Lender Harassment : వడ్డీ వ్యాపారి దాడి చేయడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో జరిగింది. మృతుడు శివనాథ్ రెడ్డి చెన్నూరు మండలం ఉప్పరపల్లె వాసిగా గుర్తించారు. శివనాథ్ రెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్‌లో బుకింగ్ ఏజెంటుగా పని చేస్తున్నట్లు మృతుని బంధువులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మోహన్‌రెడ్డి అనే వడ్డీ వ్యాపారి వద్ద శివనాథ్ విడతల వారీగా 1,60,000 రూపాయలు తీసుకోగా అధిక వడ్డీ చెల్లించాలని వేధించడంతో ఉరేసుకున్నాడని మృతుని బంధువులు తెలిపారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మోహన్‌రెడ్డి వేధింపుల వల్ల గతంలో కూడా ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. మోహన్ రెడ్డిని అరెస్టు చేసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని మృతిని బంధువులు కోరారు. అతని కారణంగా మరొకరు ఆత్మహత్యకు చేసుకోకూడదన్నారు. శివనాథ్ రెడ్డి మృతితో అతని కుటుంబం అనాథగా మారిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి వడ్డీ వేధింపుల నుంచి ప్రజలను రక్షించాలని పోలీసులను కోరారు.