భద్రాచలంలోని గోదావరి వరద సిత్రాలు - రెండు రోజుల నుంచి ఆస్పత్రిలోనే 12 ఏళ్ల బాలుడి మృతదేహం - Godavari Floods in Bhadrachalam - GODAVARI FLOODS IN BHADRACHALAM
Published : Jul 29, 2024, 4:29 PM IST
People Suffering From Floods In Bhadrachalam : భద్రాచలంలోని వరద ప్రవాహానికి దిగువన ఉన్న ముంపు మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూనవరం మండలానికి చెందిన 12 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందడంతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి దారిలేక రెండు రోజులు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. కూనవరానికి చెందిన శివ అనే బాలుడు అనారోగ్యం బారిన పడడంతో ప్రభుత్వ అంబులెన్స్‌లో గుంటూరుకి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమించడంతో మార్గంమధ్యలోనే బాబు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని తిరిగి కూనవరానికి తీసుకొస్తుండగా గోదావరి వరద చుట్టూ ముట్టేసింది. దీంతో బాలుడి మృతదేహాన్ని రెండు రోజుల పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫ్రీజర్‌లో ఉంచాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం వరద తగ్గి రోడ్లపై నుంచి నీరు లేకపోవడంతో బాలుడి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కూనవరం మండలంలోని వారి సొంత గ్రామానికి తరలించారు. ప్రభుత్వం స్పందించి ముంపు గ్రామాలను ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.