తెలంగాణ

telangana

ETV Bharat / videos

హనుమకొండ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Temple Robbery In Hanamkonda

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 10:52 PM IST

Peddamma Thalli Temple Robbery In Hanamkonda : హనుమకొండ జిల్లా అంబాలలో పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. పరిసరాలోని ఆలయంలోకి గుర్తుతెలియని యువకుడు ప్రవేశించి హుండీ పగలగొట్టి నగదు, అమ్మవారి కానుకలు ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున ఆలయానికి వెళ్లిన గ్రామస్తులు చోరీ జరిగినట్లు గుర్తించారు. కమలాపూర్ పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆలయంలో 50 వేల నగదుతో పాటు రూ. 30 వేల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Temple Robbery In Hanamkonda : దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయింది. దేవాలయ కమిటీ ప్రతినిధుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాలనీల్లో ఊళ్లకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అవసరమైతే ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు, తిరిగి ఎప్పుడు వస్తున్నారనే విషయాల గురించి పోలీసులకు ముందస్తుగా తెలియజేయాలని వివరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details