తన ఇంటి గోడపై మేక ఎక్కిందని మహిళపై పాస్టర్ దాడి - వీడియో వైరల్ - pastor attack on Woman Gurramguda - PASTOR ATTACK ON WOMAN GURRAMGUDA
Published : May 30, 2024, 12:50 PM IST
|Updated : May 30, 2024, 1:19 PM IST
Pastor Attacks on Woman In Meerpet : మహిళా మేకల కాపరిపై ఓ చర్చి పాస్టర్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ గుర్రంగూడలో ఈనెల 24 వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో పద్మ అనే మహిళ తన గొర్రెలు, మేకలను మేపుతుండగా ఒక మేక పాస్టర్ దేవ సహాయం ఇంటి ప్రహారి గోడ ఎక్కింది.
ఈ క్రమంలో పాస్టర్ ఆ కాపరిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చీపురు కట్టతో దాడి చేశాడు. దెబ్బలకు తాలలేక ఆ మహిళ ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తింది. అయిన వదలకుండా తనను వెంబడించి విపరీతంగా కొట్టి గాయపరచి తన కుక్కతో కరిపించాడనికి ప్రయత్నించాడని బాధితురాలు వాపోయింది. పాస్టర్ దాడి చేసిన దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ టీవీలో ఉన్న వీడియోల ఆధారంగా పోలీసులు పాస్టర్ దేవ సహాయంపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.