తెలంగాణ

telangana

ETV Bharat / videos

కూకట్​పల్లిలో పార్కింగ్​ విషయంలో వివాదం - ఫ్లాట్​ ఓనర్​ ఇంటికి తాళం వేసిన ల్యాండ్ యజమాని - Dispute over parking place

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 7:24 PM IST

Parking Place Dispute In Kukatpally : కూకట్ పల్లిలో ఓ అపార్ట్​మెంట్ ల్యాండ్ యజమాని అపార్ట్​మెంట్​లో ఓ ఇంటి ఓనర్​ల మధ్య పార్కింగ్ ప్లేస్ విషయంలో వివాదం కలకలం రేపింది. అపార్ట్​మెంట్ ప్లాట్ ఓనర్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా ల్యాండ్ ఓనర్లు తాళం వేసిన ఘటన కూకట్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్​లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.  

పాపారాయుడు నగర్​లోని నయన్స్​ నేచర్స్​ సెరెన్ అపార్ట్​మెంట్లో ఓ ప్లాట్​ను జయప్రకాశ్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నివాసముంటున్నారు. అయితే తాజాగా కారు​ పార్కింగ్​ విషయంలో భూ యజమానులు తనతో గొడవపడి భౌతికంగా దాడికి దిగారని జయప్రకాశ్ ఆరోపించారు. తమకు ల్యాండ్ ఓనర్లతో ఇబ్బంది ఉందని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బిల్డర్ల నుంచి ఫ్లాట్​ను కొనుగోలు చేసినప్పుడు తనకు రెండు పార్కింగ్​ ప్లేస్​లు అలాట్​ చేశారని ఐదేళ్ల తర్వాత ల్యాండ్ ఓనర్లు వచ్చి పార్కింగ్ స్థలం తమదని వాగ్వాదానికి దిగారని మీడియాకు తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించిన సోసైటీ సభ్యులతో పాటు అక్కడ నివసించే వారిపైనా దుర్భాషలాడారని అతడు ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా తాళం వేసి భయబ్రాంతులకు గురి చేశారని మీడియాతో వాపోయాడు. ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details