గంగమ్మ ఒడిలో కొలువుదీరిన శివయ్య - వీడియో చూశారా? - PAMAPURAM CHECK DAM VIDEO VIRAL
Published : Aug 21, 2024, 1:50 PM IST
Pamapuram Check Dam Attracts Public : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో ఊకచెట్టు వాగు చెక్‌డ్యామ్‌లో గంగమ్మ ఒడిలో కొలువుదీరినట్లు ఉన్న శివయ్య విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్‌లు జలకళ సంతరించుకున్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఐదేళ్ల క్రితం రూ.5.50 కోట్లతో ఊకచెట్టు వాగుపై చెక్‌డ్యామ్‌ను నిర్మించారు.
చెక్డ్యామ్లోనే 36 అడుగుల ఎత్తైన భారీ శివుడి విగ్రహం నిర్మించారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో వాగులోని శివుడి విగ్రహం చుట్టూ నీరు చేరి చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. విగ్రహానికి నలువైపులా ఎటుచూసినా నీరు ప్రవహిస్తూ అందాలను మరింతగా పెంచుతోంది. గంగమ్మ ఒడిలో శివయ్య కొలువుదీరిన అందాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.