ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒప్పంద నర్సు ఆత్మహత్యాయత్నం - గత ప్రభుత్వ తీరుతోనే ఈ గతి పట్టిందని ఉద్యోగుల ఆవేదన - Nurse Attempt To Suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 3:33 PM IST

Published : Aug 24, 2024, 3:33 PM IST

Paderu District Hospital Nurse Suicide Attempt : అల్లూరి జిల్లాలోని పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఒప్పంద నర్సుగా పని చేస్తున్న షేక్ భాను ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక నిద్రమాత్రలు మింగినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో సుమారు 90 మంది ఒప్పంద ఉద్యోగులుగా  పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి వేతన ఎకౌంట్లను ఏపీవీపీ నుంచి డీఎంఈ విభాగంలో మార్చింది.

గత ప్రభుత్వ చర్యల వల్లే తమకీ గతి పట్టిందంటూ ఆస్పత్రి బయట ఫ్లకార్డులు పట్టుకుని ఒప్పంద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆరు నెలలుగా నిలిపివేసిన జీతాలను వెంటనే చెల్లించి తమను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో వారు కనీసం ఇంటి రెంటు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.షేక్ భాను పిల్లల స్కూల్​ ఫీజుల కట్టడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తోటి ఉద్యోగులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details