చోరీకి గురైన 555 సెల్‌ఫోన్లు రికవరీ - 'రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా ఫస్ట్ ప్లేస్' - Cell Phones Recovery - CELL PHONES RECOVERY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2024, 7:13 PM IST
Cell Phones Recovery: వైఎస్సార్ జిల్లా ప్రజలు వివిధ రకాల కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. దాదాపు ఏడాది కిందట పోయిన సెల్ ఫోన్లను సైతం పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికవరీ చేశారు. సుమారు కోటి 8 లక్షల రూపాయల విలువ చేసే 555 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి, ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
బాధితులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో సుమారు ఏడు కోట్ల నాలుగు లక్షల రూపాయల విలువ చేసే 4068 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. సెల్ ఫోన్లు పోయిన వెంటనే తక్షణం బ్యాంకుకు సంబంధించిన వివరాలను క్లోజ్ చేయాలన్నారు. సెల్ ఫోన్లు రికవరీలో రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు కూడా సెల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు.