కృష్ణానదికి నవ హారతుల కార్యక్రమం పునః ప్రారంభం - NAVAHARATULU TO KRISHNA - NAVAHARATULU TO KRISHNA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 10:21 PM IST

Navaharatulu to Krishna River at Vijayawada: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా గురువారం నుంచి కృష్ణానదికి నవ హారతుల కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా కొండపైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కొండ దిగువన కృష్ణా నదికి నవహారతుల కార్యక్రమాన్ని సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రారంభించారు. గతంలో పవిత్ర సంగమం ఘాట్​లో హారతుల కార్యక్రమాన్ని నిర్వహించేవారు. వైకాపా ప్రభుత్వ హయాంలో హారతుల కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి దిగువన దుర్గా ఘాట్​లో ఈ నవ హారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో పవిత్ర సంగమం ఘాట్​లో కూడా ప్రారంభించే ఆలోచనలో దేవాదాయ శాఖ ఉందని అధికారులు తెలిపారు. 

Gayatri Devi Avataram Durga Devi : శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. "ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః" అని ఆ తల్లిని ప్రార్ధిస్తే సమస్త కోరికలు తీరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. సకల దేవత మంత్రాలకు గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంటుంది. అందుకే సమస్త దేవత మంత్రాలకు చివర గాయత్రీ చేర్చి, రుద్ర గాయత్రీ, విష్ణు గాయత్రీ, లక్ష్మీ గాయత్రీ, వినాయక గాయత్రీ అని గాయత్రీ మంత్రంతో కలిపి చెప్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.