ETV Bharat / state

కన్న కొడుకు దారుణాలు- ఆస్తి రాయించుకుని తల్లికి చిత్రహింసలు - Son Attacks Mother Over Property - SON ATTACKS MOTHER OVER PROPERTY

తల్లికి తెలియకుండా 22 ఎకరాల భూమి, ఆస్తులను ఆక్రమించుకున్న కుమారుడు

Son Attacking Mother for Property in Anantapur District
Son Attacking Mother for Property in Anantapur District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 4:08 PM IST

Son Attacking Mother for Property in Anantapur District : ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజూకు మంట కలిసి పోతున్నాయి. కేవలం ఆర్థిక సంబంధాలే రాజ్యమేలుతున్నాయి. నవ మాసాలు కడుపున మోసి పెంచిన కన్నతల్లిని ఓ తనయుడు చిత్రహింసలు పెడుతున్నాడు. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో భర్తకు దూరమైన ఆమెకు అండగా ఉండాల్సింది పోయి మానవ మృగంలా ప్రవర్తించాడు. చెడు వ్యసనాలకు బానిసై తరచూ ఇంటికి వెళ్లి కన్న తల్లిపై దాడికి పాల్పడుతున్నాడు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆ తల్లి భరిస్తూనే ఉంది. చివరికి ఆ తల్లి ఆస్తిపై కన్నేసిన అతడు ఆమెకు తెలియకుండానే 22 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

తల్లికి తెలియకుండా దౌర్జన్యంగా ఆస్తుల ఆక్రమణ : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామంలో నాగవేణి అనే వృద్దురాలు నివాసముంటుంది. ఈమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త మరణాంతరం కుమారుడు అశోక్ వద్దనే ఉంటూ నాగవేణి జీవనం సాగిస్తుంది. అయితే ఆమె కుమారుడు అశోక్ చక్రవర్తికి తల్లి ఆస్తిపై కన్ను పడింది. కన్న తల్లికి తెలియకుండానే 22 ఎకరాల భూమిని తన పేరున మార్చుకున్నాడు. అలాగే ఇతర ఆస్తులను సైతం దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని వృద్దురాలు నాగవేణి ఆవేదన వ్యక్తం చేసింది.

'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide

వ్యసనాలకు లోనై తరుచూ తల్లిపై దాడి : కుమారుడు వ్యసనాలకు లోనై తరచూ దాడి చేస్తున్నట్లు నాగవేణి తెలిపింది. నిన్న(గురువారం) కూడా ఇంటి వద్ద అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు వాపోయింది. గాయపడిన ఆమెను స్థానికులు, బంధువులు ఉరవకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా తనను ఇంటి నుంచి బయటకి గెంటేసినట్లు బాధితురాలు నాగవేణి వాపోయింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది.

పట్టుదల ఎక్కువ - అనుకున్నది సాధించేవరకు ఊరుకోడు: పవన్​కల్యాణ్​ తల్లి అంజనాదేవి - Pawan Mother Anjana Devi Interview

'మీ చేతి చుర్మా తిన్నాక మా అమ్మ గుర్తొచ్చారు'- నీరజ్‌ తల్లికి ప్రధాని మోదీ లేఖ - Neeraj Chopra Mom Special Dish

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.