తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఓయూ దిద్దిన వాచ్‌మెన్‌ కథ ఇది - కోచింగ్‌ లేకుండానే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 8:17 PM IST

Osmania watch man got three government jobs : జీవితంలోని ఎత్తుపల్లాలను చూసి భయపడితే భవిష్యత్తు వైపు అడుగులు వేయటం కష్టమవుతుంది. అందుకే పట్టుదలతో ప్రయత్నాలు మెుదలు పెట్టి బంగారు భవిష్యత్తుకు పూలబాటలు వేసుకున్నాడు ఆ యువకుడు. నిరుపేద కుటుంబ, ఇద్దరు తోబుట్టువులు. సరైన వసతులు లేకుండా సాగిన విద్యాభ్యాసం. అయినా పట్టుదలతో ప్రయత్నాలు మెుదలు పెట్టాడు మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఉస్మానియా వర్సిటీలోని ఈఎంఆసీ(EMRC)విభాగంలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేశాడు.  

Face2Face With Golle Praveen : అర్థిక ఇబ్బందులను, పేదరికాన్ని అధిగమిస్తూ అనునిత్యం కసిగా చదివి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకున్నాడు. ఇటీవల గురుకులకు సంబంధించిన వచ్చిన ఫలితాల్లో పీజీటీ, టీజీటీ సహా జూనియర్ లెక్చరర్ పోస్టులను సాధించాడు. జేఎల్​కు రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు, పీజీటీకి 17వ ర్యాంకు సాధించి ఆందరీ చేత వాహ్ అనిపించాడు. మరి, అవి సాధించడానికి పడిన కష్టాల కథేంటో ఆ విద్యాకుసుమం మాటల్లోనే విందాం. 

ABOUT THE AUTHOR

...view details