ETV Bharat / state

రూ. 5,260 కోట్ల పెట్టుబడులు, 12 వేల మందికి ఉద్యోగాలు - ప్రభుత్వంతో 6 ఫార్మా కంపెనీల ఒప్పందం

ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం - 6 కంపెనీలతో ఎంవోయూలు - దాదాపు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 6 ఫార్మా కంపెనీలు

6 COMPANIES INVESTMENT IN TELANGANA
TELANGANA GOVT MOU WITH 6 COMPANIES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Telangana Government Mou With Six Pharma Companies : రాష్ట్రంలో ప్రముఖ ఫార్మా కంపెనీలు భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవాళ సచివాలయంలో కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రితో సమావేశమైన కంపెనీల జాబితాలో ఎంఎస్​ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు ఉన్నారు.

దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఆరు ఫార్మా కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలపై సంతకాలు చేశారు. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12 వేల 490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించనుంది. ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్​తో పాటు ఆర్​అండ్​డీ సెంటర్ నెలకొల్పనుంది.

నాలుగు నెలల్లో నిర్మాణ పనులు : లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ ఫార్మా ఆర్​అండ్​డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఈ అవగాహన ఒప్పందాల సందర్భంగా టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమలు ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితోపాటు ఆరు కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్​లో వివింట్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడులు - 1000 మందికి ఉద్యోగాలు - VIVINT PHARMA INVESTMENT IN HYD

హైదరాబాద్​​ను ప్రపంచ ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్‌బాబు - Minister Sridhar Babu Meet

Last Updated : 5 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.