తెలంగాణ

telangana

కృష్ణాష్టమి వేడుకల్లో ఆపశ్రుతి - ఉట్టి కొడుతుండగా కర్ర విరిగి కింద పడ్డ వ్యక్తి - DAHI HANDI ACCIDENT IN HANAMKONDA

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 9:19 AM IST

One Person Injured in Hanmakonda (ETV Bharat)

One Person Injured in Hanamkonda : అప్పటి వరకు ఆటపాటలతో సాగుతున్న వారి కార్యక్రమంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అందరి కంటే ముందుగా అందుకోవాలనుకున్న అతని తపన, ప్రాణానికే ముప్పు తెచ్చి పెట్టింది. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొడుతుండగా ఒ వ్యక్తి కిందపడి గాయపడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో వెంచర్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రాత్రివేళ ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆటలో ఉట్టి కట్టిన కర్రలను ఎక్కి దాన్ని కొట్టడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో బరువు అధికమై ఒక్కసారిగా ఉట్టి కట్టిన కర్రలు కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులు కింద పడ్డారు. అందులో ఒకరు ప్రమాదం నుంచి బయటపడగా, మరొకరు రేగుల వెంకన్న (55) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని అక్కడే ఉన్న యువకులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details