బామ్మా మజాకా - వినాయకుడి మండపంలో టిక్‌టాక్ బామ్మ డ్యాన్స్ అదుర్స్ - Old Woman Dance Viral Video - OLD WOMAN DANCE VIRAL VIDEO
Published : Sep 15, 2024, 4:56 PM IST
Old Woman Dance Viral Video In Hyderabad : ఓ బామ్మ 78 ఏళ్ల వయసులోనూ తన డ్యాన్స్‌తో అదరగొడుతోంది. హైదరాబాద్‌లో టిక్ టాక్ బామ్మగా పిలుచుకునే విజయలక్ష్మి (78) ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటోంది. వినాయకుడి మండపం వద్ద ఆ బామ్మ వేసిన స్టెప్పులు అక్కడున్న వారిని తన అభిమానులుగా మార్చేసింది. కాలనీవాసులు సరదాగా ఆ బామ్మతో కలిసి డ్యాన్స్ చేశారు.
టిక్‌టాక్ ఉన్న సమయంలో ప్రతి రోజు డ్యాన్స్ చేసి అందులో పోస్ట్ చేసేది. రీల్స్ ద్వారా దాదాపు 80 వేల మంది అభిమానులను సంపాదించుకొంది. టిక్‌టాక్ యాప్ తొలగించిన అనంతరం బామ్మ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాలో దాదాపు 22 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఆ బామ్మ తన ఇన్‌స్టాలో 3300లకు పైగా పోస్టులు పెట్టింది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండటానికి కారణం ప్రతి రోజు యోగా చేయడమే అంటోంది ఈ టిక్‌టాక్ బామ్మ.