వేరే లెవెల్లో అనంత్ బరాత్- అంబానీ ఇంట పెళ్లా మజాకా! - Anant Radhika Wedding - ANANT RADHIKA WEDDING
Published : Jul 13, 2024, 5:30 PM IST
Anant Radhika Baaraat : ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబయి నగరం మిరుమిట్లు గొలిపింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అనంత్, రాధిక శుక్రవారం రాత్రి ఒక్కటయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు.
వివాహానికి ముందుకు అనంత్ పూలతో అలంకరించిన విలాసవంతమైన రెడ్ కలర్ కారులో అంబానీల నివాసమైన యాంటిలియా నుంచి జియో కన్వెన్షన్ సెంటర్‌కు బరాత్‌తో తరలివచ్చారు. ఆ సమయంలో సినీ తారలు షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ కాలు కదిపారు. వారికి రజనీకాంత్ కూడా జత కలిశారు. అనిల్ కపూర్ తన మార్క్ స్టెప్పులు వేశారు. అనన్య పాండే, హార్దిక్ పాండ్య అదరగొట్టేశారు. ముకేశ్ అంబానీ తన మనవళ్లతో చిందులేశారు. నీతా అంబానీతోపాటు కుటుంబసభ్యులంతా డ్యాన్స్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.