ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కాలుష్య నియంత్రణ కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్: ఛైర్మన్​ కృష్ణయ్య - Pollution Control Board - POLLUTION CONTROL BOARD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 6:07 PM IST

New Chairman of Pollution Control Board: రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నూతన చైర్మన్ పి. కృష్ణయ్య తెలిపారు. విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. తమ శాఖలోని ప్రధాన సమస్యలు, భవిష్యత్​లో సాధించాల్సిన లక్ష్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శాఖలో సిబ్బంది కొరత ఏర్పడిందని, 290 ఉండాల్సిన సిబ్బంది ప్రస్తుతం 80 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అవసరమైన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడతామన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం రాష్ట్రంలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తామన్నారు.  విశాఖలో ఆగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్టాండర్డ్ అపరేటింగ్ సిస్టమ్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details