తెలంగాణ

telangana

ETV Bharat / videos

అత్తతో వివాహేతర సంబంధం - మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Nephew Killed to Uncle - NEPHEW KILLED TO UNCLE

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 7:50 PM IST

Nephew Killed the Uncle in Anantapur District : సొంత మేనమామను హత్య చేసిన మేనల్లుడిని కల్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కూరకులతోట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేనమామ వన్నూరుస్వామి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మేనల్లుడు (17), పథకం ప్రకారం వన్నూరుస్వామిని సూరకత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు కల్యాణదుర్గం సీఐ హరినాథ్ తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి అతడిని రిమాండ్​కు పంపించినట్లు సీఐ పేర్కొన్నారు.

ఈ హత్యపై సీఐ హరినాథ్ సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అక్క కుమారుడైన మేనల్లుడు, వన్నూరుస్వామిని ఎలాగైనా చంపి అడ్డు తొలగించుకోవాలని గ్రామ సమీపంలోని చెలి గెద్దెలకొండ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం మేనమామకు మద్యం తాగించి పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న సూరకత్తితో కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడు వాళ్ల అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details