ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్​లో నిర్లక్ష్యం - అధికారులకు కలెక్టర్​ షోకాజ్ నోటీసులు - Show Cause Notice to officials - SHOW CAUSE NOTICE TO OFFICIALS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 9:55 PM IST

Nellore District Collector Angry With Officials : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్నికల అధికారులపై కలెక్టర్ హరినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వసతులు కల్పించక పోవడంతో ఓటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు మంచి నీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అక్కడి ఎన్నికల అధికారిపై ఉద్యోగులు మండిపడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడంతో ఎండలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు గంటల తరబడి ఉద్యోగులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని వాపోయారు.

అలాగే ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతవ్వడంపై పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. చివరకి ఓటు ఎక్కడుందో తెలియక చాలా మంది ఉద్యోగులు అయోమయానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కనీస వసతులు కల్పించకపోవడంతో ఉద్యోగులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆర్డీవో మధులత, తహశీల్దార్ శివనాగిరెడ్డి, ఆర్​ఐ పృథ్వీకి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details