ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: విశాఖ రైల్వే జోన్​ - బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై కూటమి నేతల మీడియా సమావేశం - NDA Leaders media conference

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 10:08 AM IST

Updated : Apr 27, 2024, 10:35 AM IST

LIVE : విశాఖపట్నం రైల్వే జోన్‌ (Visakha Railway Zone) ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని (Ap Govt) ఇప్పటికే అడిగామని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) చెప్పారు. జోన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకే రూ.9,138 కోట్లు (Union Budget 2024) కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో ఏడాదికి 240 కి.మీ. మేర నూతన ట్రాక్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98 శాతం లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని అన్నారు. విశాఖ రైల్వే జోన్​పై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై ఎన్టీఏ కూటమి నేతల మీడియా సమావేశం -  మీ కోసం 
Last Updated : Apr 27, 2024, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details