Anakapalli District Police Seize 450 Kg Of illegal Ganja : ఏం ఐడియారా బాబు. చేసే పని దొంగ పని అయినా చాలా స్మార్ట్‌గా, హైటెక్‌గా చేసేస్తున్నారు స్మగ్లర్లు. అస్సలు అనుమానం రాకుండా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పుష్ప సినిమాలో హీరో పోలీసుల కళ్లు కప్పి ఎర్రచందనం దుంగలను తరలించడానికి ఎన్నెన్ని ఎత్తులు వేశాడో చూశాం. అయితే అది సినిమాలోనే జరుగుతుందని అనుకుంటే మీరు పొరబడినట్లే. అచ్చం అదే రేంజ్లో గంజాయి స్మగ్లర్లు కూడా రెచ్చిపోతున్నారు. వారి ఐడియాలను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీనికి అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన ఘటనే ఉదాహరణ.
అనకాపల్లి జిల్లాలో పుష్ప సినిమాను తలపించే విధంగా గంజాయి స్మగ్లింగ్ జరిగింది. అశోక్ లేలాండ్ వాహనం పైభాగంలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి వాటిపై 450 కిలోల గంజాయి ప్యాకెట్లను అమర్చారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై టార్పాలిన్లతో కప్పి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. అనంతరం సీలేరు, దారకొండ రొంపుల ఘాట్ రోడ్ మీదుగా మధ్యప్రదేశ్‌కు ఈ గంజాయిని తరలిస్తుండగా గొలుగొండ పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి అక్రమంగా తరలిస్తున్న 450 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి మొబైల్ ఫోన్లను సైతం జప్తు చేశారు. ఈ గంజాయి విలువ రూ.22.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ధూల్‌పేట్‌లో గంజాయి 'పుష్ప' - ఎట్టకేలకు అంగూరి భాయి అరెస్టు
గంజాయి క్వీన్ నీతూ కోసం తీవ్రంగా గాలింపు - ఫ్యామిలీ మొత్తం ఇదే దందా