ప్రజా పాలనలో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయి : శ్రీధర్ బాబు - Sports Day Celebrations Gachibowli - SPORTS DAY CELEBRATIONS GACHIBOWLI
Published : Aug 29, 2024, 6:20 PM IST
Minister Sridar Babu On National Sports Day : ప్రజా పాలనలో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయని, క్రీడలను అన్ని రకాలుగా ప్రోత్సహించడంలో భాగంగా నూతన క్రీడా పాలసీని రూపొందించిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూల మాలలు వేసిన మంత్రులు వేడుకలను ప్రారంభించారు. క్రీడలను, క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని శ్రీధర్ బాబు అన్నారు.
క్రీడలను అన్ని విధాలుగా ప్రొత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన పథకాల గురించి ఆ దేశ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించే సామర్ధ్యం గల క్రీడాకారులను తయారు చేసేందుకు త్వరలో ప్రారంభించనున్న స్పోర్ట్స్ యూనివర్శిటీలకు స్పోర్ట్స్ స్కూళ్లను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం రూ.364 కోట్లు కేటాయించినట్లు క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి తెలిపారు.