ఇది పొలం అనుకున్నారా? కాదు రోడ్డు - వర్షం వస్తే అట్లుంటది నరహరితండా కథ - NARAHARI TANDA ISSUES IN HANAMKONDA - NARAHARI TANDA ISSUES IN HANAMKONDA
Published : Jul 25, 2024, 9:20 AM IST
Tribal Suffering Due To Lack Of Road Along With Fresh Water Facility : బీటీ రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పరిధిలోని నరహరితండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షానికే రోడ్డు చిత్తడిగా మారుతుంది. దీంతో పట్టణానికి ప్రయాణం చేయాలంటే అవస్థలు పడే పరిస్థితి నెలకొంది. తండా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కనూర్ వెళ్లడానికి రోడ్డు సరిగా లేక నానా తిప్పలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పిల్లలు స్కూల్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం మెరుగుపడలేదని తండా ప్రజలు వాపోయారు. మిషన్ భగీరథ నీరు కూడా రావడంలేదని, తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తండాలో డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు బీభత్సం సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తమ తండాకు బీటీ రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించి, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.