రేపటి నుంచి నిజం గెలవాలి మలి విడత యాత్ర - నాలుగు రోజులపాటు భువనేశ్వరి పర్యటన - Nijam Gelavali Yatra - NIJAM GELAVALI YATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 4:46 PM IST
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర ఆందోళనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిజం గెలవాలి కార్యక్రమంతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వారికి ధైర్యాన్నిస్తున్నారు. ఎవ్వరూ అధైర్యపడోద్దని, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. వారికి ఆర్థిక సాయంగా మూడు లక్షల రూపాయలను అందిస్తున్నారు.
తాజాగా నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) నిజం గెలవాలి మలి విడత యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి నాలుగు రోజులపాటు ఈ పర్యటన కొనసాగనుంది. రేపు అనగా 26వ తేదీ పోలవరం, చింతలపూడిలో భువనేశ్వరి పర్యటించనున్నారు. 27వ తేదీ తాడేపల్లిగూడెం ఉంగుటూరు, గన్నవరంలో, 28వ తేదీ నూజివీడు పెనమలూరు, గుడివాడల్లో, 29వ తేదీ మచిలీపట్నం, అవనిగడ్డల్లో పర్యటించనున్నారు.