ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పెట్టుబడులను ఆహ్వానించి ఉత్తరాంధ్ర యువత ఉపాధికి కృషి చేస్తాం : మంత్రి శ్రీనివాస్​ - MSME Minister Srinivas Interview - MSME MINISTER SRINIVAS INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 12:25 PM IST

MSME Minister Kondapalli Srinivas Interview: రాష్ట్రంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు తిరిగి పూర్వ వైభవం తెచ్చే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించి యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కృషి శ్రీనివాస్​ చేస్తానంటున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తామని చెప్పారు. 

విదేశాల్లో స్థిరపడ్డ ఆంధ్రుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న రాష్ట్రాల్లోనూ ఎంఎస్‌ఎంఈల కోసం సెక్రటరీ స్థాయి అధికారి ఉన్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. దశాబ్దం తర్వాత చిన్న పరిశ్రమల నిర్వాహకుల కోరికను చంద్రబాబు మన్నించారని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కేటాయించడంతో రాష్ట్రంలో పెట్టుబడులు బలోపేతం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు భారీ పరిశ్రమలకే శాఖలో ప్రాధాన్యముందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని అప్పగించిన సెర్ప్‌, విదేశీ వ్యవహరాలను బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details